శేరిలింగంపల్లి, నవంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్ పల్లి నియోజకవర్గం శక్తి నగర్ (భారత్ నగర్) లోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్టాఫ్ రూమ్ లో ఉపాధ్యాయ సిబ్బందికి బీరువా, పాఠశాలకు సౌండ్ సిస్టం అవసరం ఉందని పాఠశాల సిబ్బంది కొమిరిశెట్టి సాయిబాబాకి విజ్ఞప్తి చేశారు. వెంటనే సాయిబాబా స్పందించి కొమిరిశెట్టి ఫౌండేషన్ ద్వారా పాఠశాలకు డబల్ డోర్ బీరువా, అహుజా సౌండ్ సిస్టంను కూకట్ పల్లి శాసన సభ్యుడు మాధవరం కృష్ణారావుతో కలిసి పాఠశాల సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ ఠాకూర్ ప్రదీప్ సింగ్, ఎస్.లక్ష్మిరత్నాకరమణి, సీనియర్ నాయకుడు రమేష్ గౌడ్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






