ప్రజా అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంపల్లి, న‌వంబర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డిలో ఉన్న హ్యుందాయ్ సర్వీస్ సెంటర్ నుండి జయభేరి సహస్ర వరకు రూ.40 అంచనా వ్యయంతో చేపట్టబోయే స్ట్రాం వాటర్ డ్రెయిన్ లైన్ నిర్మాణం పనులకు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి, పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గౌలిదొడ్డి ప్రాంతంలోని హ్యుందాయ్ సర్వీస్ సెంటర్ వద్ద వర్షాకాలంలో నీటి నిల్వ కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు స్ట్రాం వాటర్ డ్రెయిన్ లైన్ నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. ఐటీ కారిడార్ ప్రాంతంలో జనాభా, రహదారి విస్తరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మౌలిక వసతుల అభివృద్ధిని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ నిర్మాణం పనులు పూర్తయిన తర్వాత గౌలిదొడ్డిలో నీటి నిల్వ సమస్య గణనీయంగా తగ్గి ప్రజలకు పెద్ద ఉపశమనం కలుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్ , జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు ఈఈ శిరీష , ఏ ఈ రషీద్, సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్ , ప్రసాద్, కిషన్, కృష్ణ, శ్రీశైలం, శ్రీను, వర్క్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, కాలనీ వాసులు, స్థానిక నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here