మహిళా సాధికారితకోసం ఎంతగానో కృషి చేసిన వ్య‌క్తి ఇందిరాగాంధీ: జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ బస్తీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ తెలంగాణలోని మారుమూల పల్లెల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి నిలువ నీడనిచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం పాలన సాగుతుందని అన్నారు. ఉక్కు మహిళగా పేరుగాంచిన వ్య‌క్తి ఇందిరా గాంధీ అని, దేశవ్యాప్తంగా ఆమె చేసిన సేవలను స్మరించుకుంటూ మనం ముందుకు సాగాలని అన్నారు. ఇందిరా గాంధీ మహిళా సాధికారితకోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆమె పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు సయ్యద్ గౌస్, ఏకే బాలరాజ్, మునాఫ్ ఖాన్, ఇస్మాయిల్, సాజిద్, శివ గౌడ్, ఖాజా, వెంకటేష్, ముక్తార్, లతీఫ్, జాఫర్, మహిళా నాయకులు శశిరేఖ, శ్రీజ రెడ్డి, రిజ్వాన్, యూత్ కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here