N care sumana హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఆరోగ్యమే మహాభాగ్యం అని, ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఆనందం శూన్యం అని, మంచి అలవాట్లు, సరైన ఆహారం, వ్యాయామం మన జీవితంలో తప్పక పాటించాల్సిన నియమాలు అని బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర నగర్ లో N care sumana హాస్పిటల్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసిన డివిజన్ అధ్యక్షుడు వంశీ రెడ్డి ఆహ్వానం మేరకు ర‌వికుమార్ యాద‌వ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత మెగా వైద్యపరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ర‌వికుమార్ యాద‌వ్ మాట్లాడుతూ ఉచిత మెగా వైద్యపరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనే చాలా గొప్ప విషయం అని అన్నారు. ఈ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసిన వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు వంశీ రెడ్డి, N care sumana హాస్పిటల్ సిబ్బందికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. మన జీవితంలో ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమని, మన దగ్గర ఎంత సంపద ఉన్నా, ఆరోగ్యం లేకపోతే మనం ఆనందంగా ఉండలేమని అన్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూనే ఉంటారన్నారు. ఈ శిబిరంలో చర్మ వ్యాధులు, ఆర్థోపెడిక్ పరీక్షలు, బి. పి, షుగర్ టెస్టులు, రక్త పరీక్షలు ఉచితంగా చేసి ఏమైనా చిన్న సమస్యలు ఉంటే ఇక్కడే డాక్టర్లు సలహాలు ఇస్తారన్నారు. ​ఎలాంటి ఆహారం తీసుకోవాలి, రోజూ ఎంత వ్యాయామం చేయాలి అనే విషయాలను మనకు తెలియజేస్తారన్నారు. మనం ఎప్పుడూ ​మంచి అలవాట్లు, సరైన ఆహారం, వ్యాయామం మన జీవితంలో తప్పక పాటించాలని, అప్పుడే మనమందరం ఆరోగ్యంగా, సంతోషంగా జీవించగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గా ప్రసాద్, నాగభూషణం, నర్సింగ్ రావు, బాలు యాదవ్, భాస్కర్ గౌడ్, రేపన్ రాజు, సాయి, మమత, రేణుక, జయశ్రీ, కార్యకర్తలు, స్థానిక కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here