వన భోజనాలతో ఐక్యత, స్నేహభావం: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కార్తీక మాస వనభోజనాలతో ఐక్యత, స్నేహభావం పెంపొందుతుందని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. బీహెచ్ఈఎల్ ప్రభుత్వ కాలేజీ ఆవరణలో తెలంగాణ శ్రీ వాసవి ఆర్యవైశ్య ఐక్యవేదిక, బీహెచ్ఈఎల్ ఓబీసీ అసోసియేషన్ ఆఫీస్ వద్ద గోకుల్ కల్చరల్, వెల్ఫేర్ అసోసియేషన్ యాదవ సంఘం, వివిధ సామజిక వర్గాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజన కార్యక్రమాలలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ వాసవి ఆర్య వైశ్య వనభోజన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజి భరత్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. వివిధ సామాజిక వర్గాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సామూహిక వనభోజనాల కార్యక్రమంలో కార్పొరేటర్ మాట్లాడుతూ ఒకే చోట చేరి సామూహిక భోజనాలు చేయడం అభినందనీయమన్నారు. చెట్ల నీడలో భోజనం చేయడం ద్వారా ప్రకృతితో మనకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటామని అన్నారు.

బంధువులు, స్నేహితులు సంఘ సభ్యుల మధ్య ఐక్యత సంతోషాన్ని పెంపొందించుకుంటామని అన్నారు. ప్రకృతిని కాపాడుకోవడం అలాగే పిల్లలకు సంస్కృతిని పరిచయం చేసే గొప్ప సాంప్రదాయం కలిగిన పండుగ కార్తీక మాస వనభోజనాలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంజీరా గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గజ్జల యోగానంద్, సురేష్ కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, నటరాజ్, మల్లేష్, శ్రీనివాస్, సత్యం, వినయ్, పలువురు ప్రముఖులు, తెలంగాణ శ్రీ వాసవి ఆర్యవైశ్య ఐక్యవేదిక, గోకుల్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ బిహెచ్ఈఎల్ యాదవ సంఘం సభ్యులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here