మియాపూర్, హైదర్‌నగర్ పరిధిలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 22న మియాపూర్, హైదర్‌నగర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వివిధ 11 కేవీ ఫీడర్ల పరిధిలో నిర్ణీత సమయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మయూరి నగర్ సబ్‌స్టేషన్ పరిధిలోని మయూరి నగర్ ఫీడర్ పై మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల వరకు సరఫరా నిలిచిపోనుంది. ఈ సమయంలో మయూరి నగర్, ఎస్‌బీఐ బ్యాంక్ రోడ్, ఆర్క్ టవర్స్ రోడ్, ఓల్డ్ ఏజ్ హోమ్ రోడ్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుంది. ఇదే సబ్‌స్టేషన్ పరిధిలోని రామ్ నరేష్ నగర్ ఓవర్‌హెడ్ ఫీడర్ పై కూడా ఇదే సమయంలో సరఫరా నిలిపివేయనున్నారు. మిత్రా హిల్స్, ప్రశాంత్ నగర్, ఏఎస్ రాజు నగర్, ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రాంతాలు ప్రభావితమవుతాయి.

కేటీఆర్ ఫీడర్ పరిధిలో ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. కేటీఆర్ కాలనీ, జున్రమ్ ఫేజ్-1 ప్రాంతాలు ఈ అంతరాయానికి గురికానున్నాయి. మియాపూర్ ఎక్స్ రోడ్ సబ్‌స్టేషన్ పరిధిలోని శ్రీల గార్డెన్స్ ఫీడర్ పై ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. శ్రీల గార్డెన్స్, నడిగడ్డ తండా, హైటెన్షన్ లైన్ ప్రాంతం, సుభాష్ చంద్రబోస్ నగర్ ప్రాంతాలు ప్రభావితమవుతాయి. హెచ్‌ఎంటీ హిల్స్ సబ్‌స్టేషన్ పరిధిలోని నందమూరి నగర్, సెవెన్ హిల్స్, బృందావన్ కాలనీ ఫీడర్లపై ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. నందమూరి నగర్, హైదర్‌నగర్ గ్రామం, నిజాంపేట్ మెయిన్ రోడ్, సెవెన్ హిల్స్ అపార్ట్‌మెంట్స్, నాగార్జున హోమ్స్, బృందావన్ కాలనీ, జున్రమ్ ఫేజ్-2 ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడనుంది. నిర్వహణ పనుల దృష్ట్యా ఆయా ప్రాంతాల ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here