శేరిలింగంపల్లి, నవంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): బిహెచ్ఈఎల్ ఓబీసీ కార్యాలయం వద్ద, బీరంగూడ గుట్ట భ్రమరాంబిక మల్లికార్జునస్వామి ఆలయం వద్ద యాదవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీకమాస వనభోజన మహోత్సవ కార్యక్రమాలలో బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరం కార్తీకమాస వనభోజన కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఆనందకరమైన విషయం అని అన్నారు. వనభోజనాలు, సమావేశాలు మాత్రమే కాకుండా యాదవులు అందరూ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కమిటీ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారిని గుర్తించి వారి ఆరోగ్యపరమైన, విద్యాపరమైన సహాయం అందించి అందరినీ వృద్ధిలోకి తీసుకురావాలని సూచించారు. తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బసవరాజ్ యాదవ్, మహేష్ యాదవ్, నగేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, నంద గోపాల్, పాములేటి యాదవ్, రాజు యాదవ్, అంజయ్య యాదవ్, వెంకటేష్ యాదవ్, సంఘ నాయకులు పాల్గొన్నారు.






