చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ లో ఉన్న గుర్నాథమ్ చెరువు సుందరీకరణలో భాగంగా Nexus select Malls కంపెనీ CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువుల పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ, పునరుద్ధరణ పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 64 చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. చెరువుల సుందరీకరణతో స్వచ్చమైన వర్షపు జల సిరులను ఒడిసిపడుదామని అన్నారు. చెరువుల జలకళతో గ్రామీణ వాతావరణం నెలకొల్పడమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. చెరువులను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయ‌ని, జీవ వైవిధ్యం పెరుగుతుంద‌ని, పక్షులు వలసలు మొదల‌వుతాయ‌ని, చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో CSR ఐటీ సంస్థ ప్రతినిధి చైతన్య, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here