శేరిలింగంపల్లి, అక్టోబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా పార్టీ హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో డివిజన్ బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. గంగారం గ్రామంలో బీజేపీ సీనియర్ నాయకుడు దేవాల్ యాదవ్ నివాసంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డివిజన్ లో నిర్వహించవలసిన సంస్థాగత విషయాలపై చర్చించి, హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీలోని యువ మోర్చా , ఓబీసీ మోర్చా మహిళా మోర్చా కమిటీలను ప్రకటించారు. హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ మహిళా మోర్చా డివిజన్ అధ్యక్షురాలిగా నిర్మలా రాధాకృష్ణ, ఓబీసీ మోర్చా డివిజన్ అధ్యక్షుడిగా నరసింహ యాదవ్ , ఓబీసీ మోర్చా డివిజన్ ప్రధాన కార్యదర్శిగా రాజు గౌడ్ , ఉపాధ్యక్షుడిగా నరసింహ చారి , కోశాధికారిగా పవన్ కుమార్ , కార్యదర్శులుగా శేఖర్ ముదిరాజ్ , నాగేశ్వర రావు , శ్రీనివాస్ , యువ మోర్చా డివిజన్ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ , యువ మోర్చా డివిజన్ ప్రధాన కార్యదర్శిగా బాలరాజు , ఉపాధ్యక్షుడిగా వినయ్ కుమార్ , కార్యదర్శిగా దత్తాత్రేయ , మహేష్ యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ , డివిజన్ బీజేపీ ఇంచార్జ్ , జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు మూల అనిల్ గౌడ్ , బీజేపీ సీనియర్ నాయకుడు దేవాల్ యాదవ్, మహిళా మోర్చా నాయకురాలు వినయ , జిల్లా మాజీ అధికార ప్రతినిధి అజిత్ సేనాపతి , మాజీ అధ్యక్షుడు శ్రీధర్ రావు చేతులమీదుగా నియామక పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు దేవాల్ యాదవ్ , బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా మాజీ అధికార ప్రతినిధి అజిత్ సేనాపతి , మహిళా మోర్చా నాయకురాలు వినయ , మాజీ అధ్యకుడు శ్రీధర్ రావు , మాజీ కౌన్సిలర్ రమణయ్య , బీజేపీ నాయకుడు సత్యనారాయణ రాజు , బీజేపీ మహిళా నాయకురాలు పార్వతి , డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు , ప్రసాద్ పాత్రో , శివాజీ , డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజు ముదిరాజ్ , కార్యదర్శి రాజు యాదవ్ , ఇతర పదాధికారులు, డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులు , శక్తీ కేంద్రం ప్రముఖ్ , ప్రభారీలు , పోలింగ్ బూత్ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.





