శేరిలింగంపల్లి, అక్టోబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాశ్ నారాయణ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పసిబిడ్డ నుంచి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తల్లిదండ్రులు తప్పక వేయించాలని అన్నారు. పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయటం వల్ల అంగవైకల్యం రాకుండా కాపాడవచ్చు అని అన్నారు. పోలియో రహిత సమాజమే లక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మోహన్ రావు, శివ ముదిరాజ్, మహేశ్వర్ రెడ్డి, బసవేశ్వర్ రావు, ఆషా వర్కర్ సుజాత, సపోర్టింగ్ స్టాఫ్ అక్తర్ బేగం, సతీష్, ఈశ్వర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






