శేరిలింగంపల్లి, అక్టోబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ మసీదు బండ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శేరిలింగంపల్లి కంటెస్టెండ్ ఎమ్మెల్యే రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి రవికుమార్ యాదవ్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు పార్టీ సంపూర్ణ మద్దతు, సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో ప్రశాంత్ గౌడ్, విద్యాధర్ రెడ్డి, చందన్, నిఖిల్, కృష్ణ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలోమాదాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గంగుల రాధాకృష్ణ, పలు కాలనీ వాసులు పాల్గొన్నారు.






