మ‌ల‌బార్ గోల్డ్ & డైమండ్స్ షోరూంలో మైన్ డైమండ్స్ షో

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని చందాన‌గ‌ర్‌లో ఉన్న మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూంలో మైన్ డైమండ్స్ షో పేరిట ప్ర‌త్యేక వ‌జ్రాభ‌ర‌ణాల ప్ర‌ద‌ర్శ‌నను ప్రారంభించారు. ఇందులో భాగంగా రోజూ ధరించే నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న అక్టోబ‌ర్ 19వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు. ఇందులో భాగంగా ప్ర‌తి కొనుగోలుపై ప్ర‌త్యేక ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నామ‌ని, అన్ని బంగారు, అన్కట్, రత్నాభరణాల తరుగు చార్జీలపై 30 శాతం వరకు తగ్గింపు పొంద‌వ‌చ్చ‌ని తెలిపారు. వజ్రాభరణాల వజ్రాల విలువ పై 30 శాతం వరకు తగ్గింపు పొందే అవ‌కాశం ఉంద‌న్నారు. వినియోగదారులు కొనుగోలు చేయాలనుకున్న బంగారం విలువలో 10 శాతాన్ని ముందుగా చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని పొందవచ్చ‌ని, దీని వ‌ల్ల భవిష్యత్తులో పెరిగే బంగారం ధరల నుండి లబ్ది పొందవచ్చ‌ని అన్నారు. ఈ ఆఫర్‌ ద్వారా నగలు కొనుగోలు చేసిన వారు బుక్ చేసిన రోజు ధర లేదా కొనుగోలు చేసిన రోజు ధరల‌లో ఏ ధర తక్కువ ఉంటే ఆ ధర చెల్లించే అవ‌కాశం ఉంద‌న్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here