శేరిలింగంపల్లి, అక్టోబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి విలేజ్ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయన కార్యాలయంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా గోపన్ పల్లి విలేజ్ వాసులు మాట్లాడుతూ విలేజ్ లో అంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల ను పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే గోపన్ పల్లి విలేజ్ లో పర్యటిస్తానని, త్వరలోనే రోడ్డు పనులను ప్రారంభిస్తామని, కాలనీ లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల ను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గౌతమ్ గౌడ్, దాత్రి నాథ్ గౌడ్ ,యాదగిరి గౌడ్, అనిల్, నర్సింహ, శ్రీరామ్ రెడ్డి, నర్సింగరావు, సత్యనారాయణ, జితేందర్, రాజేందర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






