శేరిలింగంపల్లి, అక్టోబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీ నాయకుడు నవీన్ యాదవ్ కి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పార్టీ టికెట్ కేటాయించిన సందర్భంగా ఆయనను తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బిసి నాయకుడు నవీన్ యాదవ్ కి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం గొప్ప విషయమని అన్నారు. సామాజిక సేవలో నవీన్ యాదవ్ ఎల్లప్పుడూ ముందు ఉంటారని, మైనార్టీలు సైతం ఆయనకు మద్దతుగా నిలవడం అభినందనీయమని అన్నారు. ఎన్నికల్లో ఆయన గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, అఖిలభారత యాదవ మహాసభ జాతీయ కార్యదర్శి మహేందర్ యాదవ్, యూత్ అధ్యక్షుడు అందెల కుమార్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, వనపర్తి జిల్లా గొర్రెల మేకల పెంపకం దారుల సహకార సంఘం అధ్యక్షుడు మధు యాదవ్, గుడుగే శ్రీనివాస్ యాదవ్, లక్ష్మీనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






