శేరిలింగంపల్లి, అక్టోబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన చలో బస్ భవన్ లో పాల్గొనేందుకు తరలివెళ్లిన శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాని ఖాజాగూడ లోని ఆయన నివాసం లో రాయదుర్గం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అనంతరం ఆయనను రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న గచ్చిబౌలి డివిజన్ ముఖ్య నాయకులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ చేరుకొని సాయిబాబాని విడుదల చేసే వరకు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. అనంతరం కాసేపటికి పోలీసులు సాయిబాబాను విడుదల చేశారు. ఆయన వెంట చెన్నం రాజు, దారుగుపల్లి నరేష్, రాజు ముదిరాజ్, ఆకుల యాదగిరి, రమేష్ గౌడ్, అనిల్ సింగ్, శామ్లెట్ శ్రీనివాస్, అజయ్ గౌడ్ ఉన్నారు.






