శేరిలింగంపల్లి, అక్టోబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఇంచార్జ్ సురేష్, ACP నాగిరెడ్డి గారు, AMC కృష్ణ, AMOH Dr. K. S. రవి, Engineering section శ్రీదేవి, Entomology section R.చిన్న, UBD section సమీర, Electrical section లక్ష్మి ప్రియ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో 1 దరఖాస్తు రాగా, ఇంజనీరింగ్ -6, రెవిన్యూ -1 ఫిర్యాదులు వచ్చాయి. మొత్తం 8 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.






