శేరిలింగంపల్లి, అక్టోబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ దుర్గామాత కాళికామాత ఆలయ కమిటీ అధ్యక్షుడు రాచమళ్ల కృష్ణ గౌడ్, బృందం ఆధ్వర్యంలో శుక్రవారం మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తాండ్ర రాంచందర్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాచమళ్ల కృష్ణ గౌడ్ ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి కమిటీ సభ్యుల అద్వర్యంలో కేక్ కట్ చేయించారు. పండితులు వేద మంత్రాలతో రాంచందర్ గౌడ్ కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అలయ కమిటీ సభ్యులు ఉప్పల ఏకాంత్ గౌడ్, పాపి రెడ్డి, ఇందు, నవీన్, చందు, పండితులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






