- దుర్గామాత ఊరేగింపులో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి, అక్టోబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని తారానగర్, కొండాపూర్, వివిధ కాలనీలలో నిర్వహించిన దుర్గామాత ఊరేగింపు కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నృత్యాలు, మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి డివిజన్ లో వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన దసరా నవరాత్రుల్లో విశేష పూజలు అందుకున్న దేవీ మాత విగ్రహాల నిమజ్జన ఘట్టంలో భాగంగా కన్నుల పండువగా అంగరంగా వైభవంగా ఊరేగింపు కొనసాగుతుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో ఐకమత్యం పెంపొందుతుందని అన్నారు. ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి అశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.






