శేరిలింగంపల్లి, అక్టోబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): దసరా పండుగ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో పలువురు ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నాయకులు దొడ్ల రామ కృష్ణ, సమ్మారెడ్డి, గోపాల్, లింగం, సుధాకర్ , సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.






