అన్నమయ్యపురంలో శ్రీమయి స్వరార్చన

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం కొన‌సాగుతున్న అన్నమ స్వరార్చనలో భాగంగా ఈ శనివారం సాయంత్రం చల్లా మారుతి కిరణ్ విద్యార్థిని శ్రీమయి మ‌హాగణపతిం, శక్తి సహిత, శ్రీమన్నారాయణ, ముద్దుగారే యశోద, కొండలలో నెలకొన్న కోనేటి రాయటివాడు, చక్కని తల్లికి, తిరో తిరో, జగడపు, ఎక్కడి మానుష, శరణు శరణు, గరుడ గమన, అయిగిరి నందిని, గోవింద నామాలు అనే సంకీర్తనలతో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి సభక్తి పూర్వకంగా సమర్పించగా వీరికి వయోలిన్ మీద ధనుంజయ, మృదంగం మీద మల్లికార్జున్ వాయిద్య సహకారం అందించారు. అనంతరం అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా నంద కుమార్ కళాకారులను జ్ఞాపికతో సత్కరించారు. చివరిగా శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతులు అందించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here