మ‌సీదు బండ బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా ద‌స‌రా వేడుక‌లు

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): దసరా పర్వదినం సందర్భంగా మ‌సీదు బండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు మారబోయిన రవి యాదవ్ ని కలసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. మారబోయిన రవి యాదవ్ ని శాలువాలతో గౌరవించి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం అలై బలై నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రవి యాదవ్ మాట్లాడుతూ దసరా అనేది సాంఘిక ఐక్యత, ధర్మం, శ్రద్ధకు కేంద్రమైన పండుగ అని అన్నారు. ప్రజల ఆశీర్వాదమే త‌న బలమ‌ని, సంక్షేమకార్యాలు, ప్రజాసేవ, యువతకు అవకాశాల సృష్టిలో తాను నిరంతరం కృషి చేస్తాన‌ని అన్నారు. త‌న‌కు ప్ర‌జ‌ల‌ మద్దతు ఉంటుంద‌ని, వారి సహకారంతోనే శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి ప‌రుస్తాన‌నే న‌మ్మ‌కం ఉంద‌న్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కే.ఎన్.రాములు, ప్రభాకర్ గౌడ్, వెంకట్ రెడ్డి, వెంకట చారి, గడ్డం శ్రీనివాస్, వాకిటి శంకర్, కొండకల్ శ్రీ‌నివాస్, జంగయ్య, నవీన్ గౌడ్, శ్రీకాంత్ యాదవ్, స్వామి ముదిరాజ్, వెంకట్, సజుభాయ్, సైదులు, ఎల్ల స్వామి, శామప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here