శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో ఉన్న కార్పొరేటర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేసిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పాల్గొని పండిట్ దీనదయాళ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, పార్టీ రాజకీయ సిధ్ధాంతం ఏకాత్మతా మానవతా వాదాన్ని రూపొందించడంలో, పార్టీని దేశమంతటా విస్తరించడంలో ఆయన చేసిన కృషి ఎన్నటికీ మర్చిపోలేనిదన్నారు. అట్టడుగున పడివున్న మానవుడు ఐహిక సుఖంతో వర్థిల్లి, ఆధ్యాత్మిక దృష్టితో మానవసేవ చేయడమే సరైన జీవిత విధానమని అందులో వాదించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ బీజేపీ అధ్యక్షుడు శివ సింగ్ రాందీన్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు సంజీవ, నరసింహ రాజు, బాలకృష్ణ, సురేందర్, బబ్లూ సింగ్ , శేఖర్, సుబ్రమణ్యం, శ్యామ్ యాదవ్, గోపాల్ విశాల్ సింగ్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






