బాల వికాస్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చిత్రలేఖనం, ఆంగ్లభాష కౌశలం, వ్యక్తిత్వ వికాసం, విద్యాప్రతిభకు చిట్కాలు వంటి అంశాల‌లో బాలవికాస్ ప్రత్యేక శిక్షణ తరగతుల‌ను అక్టోబ‌ర్ 5వ తేదీ వ‌ర‌కు మియాపూర్‌లోని శ్రీ రామకృష్ణ వివేకానంద సేవా సమితి కార్యాల‌యంలో నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని నిర్వాహ‌కులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఔత్సాహిక విద్యార్థులు మియాపూర్‌లోని ప్ర‌గ‌తి ఎన్ క్లేవ్ కాల‌నీ, రాధా మాధ‌వ్ అపార్ట్ మెంట్ జంక్ష‌న్ వ‌ద్ద‌, ప్లాట్ నం.166లో ఉన్న శ్రీరామకృష్ణప్రభ కార్యాలయంలో సంప్ర‌దించాల‌ని అన్నారు. మ‌రిన్ని వివ‌రాల‌కు 9346761610 అనే ఫోన్ నంబ‌ర్‌లో సంప్ర‌దించాల‌ని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here