- సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): కేపీహెచ్‌బీ కాలనీలోని హాస్టల్స్ వల్ల స్థానికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, హాస్టల్ యాజమాన్యాలు, హాస్టల్స్ నివాసితులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాన్ మోజెస్, సయ్యద్ రావెల్షా అన్నారు. వన్ కాలనీ వన్ స్టాండ్ అనే నినాదంతో కేపీహెచ్‌బీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, ఇతర అసోసియేషన్లు, యూత్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో స్థానికులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు తీర్మానాలు చేశారు. ప్రతి భవనానికి గ్రౌండ్ ఫ్లోర్‌లోనే పార్కింగ్ కేటాయించే విధంగా చూడాలని, స్వీయ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడంతోపాటు ఎమర్జెన్సీ సేవలకు సిద్ధంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం మానేయాలని, హాస్టల్స్‌లో ఉంటున్న స్త్రీలు, పురుషులు లేదా యువతీ యువకులు బహిరంగ ప్రదేశాల్లో కలసి కూర్చుని అసభ్యంగా ప్రవర్తించడం మానుకోవాలని, ఈడబ్ల్యూఎస్ ఉన్న ప్రదేశాలలో హాస్టల్స్ కి పర్మిషన్ ఇవ్వకుండా చూసుకోవాలని, ప్రతి వీధిలో స్ట్రీట్ లైట్స్ వెంటనే ఏర్పాటు చేయాలని, రహదారులకు ఇరువైపులా ఫుట్ పాత్ ఆక్రమణలు చోటు చేసుకోవడంతో ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని స్థానికులు తీర్మానం చేశారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులు, హాస్టల్స్ యజమానులపై ఒత్తిడి తీసుకురావాలని వారు తీర్మానించారు.

ఈ కార్యక్రమంలో వెంకట్ గౌడ్, అట్లూరి దీపక్, మగ్దుం భాయ్, దిల్షాద్, ముబీన్ భాయ్, దినేష్ నాయుడు, సాయినాథ్ రెడ్డి, తులసి రెడ్డి, విహెచ్పి తేజ, మహేష్ ధనలక్ష్మి, వాసు వర్మ, అమర్నాథ్ నాయుడు, బాలు చౌదరి, ప్రమోద్ పవర్, గోవర్ధన్, మోజస్ మహేష్, పవన్ రెడ్డి, కేబుల్ ప్రసాద్, చందు చౌదరి, టంపు, కోటిపల్లి బాబి, ఆదినారాయణ, శ్రీను, వంశీ, దినేష్ తదితరులు పాల్గొన్నారు.





