మియాపూర్‌లో ప‌సికందు మృత‌దేహం ల‌భ్యం

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఓ 3 రోజుల ప‌సికందు మృత‌దేహం మియాపూర్ పోలీసుల‌కు ల‌భ్య‌మైంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్‌లోని ప్రేమ్ న‌గ‌ర్ బి బ్లాక్ ప‌రిధిలో ర‌హ‌దారి ప‌క్క‌న ఓ ప‌సికందు మృత‌దేహం ప‌డి ఉంద‌న్న స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌సికందు మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆ ప‌సికందు ఆడ శిశువు అని, జ‌న్మించి 2 లేదా 3 రోజులు అయి ఉంటుంద‌ని, బ‌హుశా శిశువు చ‌నిపోయాక తెచ్చి రోడ్డు ప‌క్క‌న ప‌డేసి ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేర‌కు కేసు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here