శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని కొండాపూర్ 8వ బెటాలియన్ ప్రభుత్వ పాఠశాలలో బతుకమ్మ సంబరాలను అంబరాన్ని అంటేలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ వార్డు మెంబర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రక్తపు జంగం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉపాధ్యాయురాళ్లు నప్రియ, విజయ, రజిత, కుసుమ, ప్రియాంక, మౌనిక, గీత పాల్గొన్నారు. లక్ష్మణ్, ప్రకాష్, రవి సహకారంతో ఈ వేడుకలను నిర్వహించారు.






