వినయకుమార్ పుట్ట (నమస్తే శేరిలింగంపల్లి): హెచ్ఎండిఏ ఇటీవల రీజినల్ రింగ్ రోడ్డు తుది ప్రతిపాధనకు సంబంధించిన మ్యాపు, ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామం, ఏ సర్వే నంబర్ల గుండా RRR వెళుతుందనే వివరాలను లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తో కూడిన లొకేషన్ జాబితాను HMDA వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. చాలా మందికి తమ స్థలం RRR లో పోతుందా లేదా తెలుసుకోవాలని ఉన్నప్పటికి ఎలా చెక్ చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే “నమస్తే శేరిలింగంపల్లి” RRR మ్యాప్, సర్వే నెంబర్లు, లొకేెషన్ సులువుగా గుర్తించే అవకాశం కలిపిస్తుంది. మీరు పరిశీలించండి. అవసరమైన వారికి ఈ వార్తను షేర్ చేయండి.
RRR తుది ప్రతిపాధిత మ్యాప్ ను కింద చూడండి. లింక్ ఓపెన్ చేసి జూమ్ చేస్తే పూర్తి మ్యాప్ కనిపిస్తుంది.
ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామంలోని ఏ సర్వే నంబర్ల గుండా RRR వెళుతుందనే వివరాలు కోసం కింద చూడండి.
కింద కనిపిస్తున్న లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ను మీ స్థలానికి సంబంధించిన లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తో పోల్చి చూడండి. గూగుల్ మ్యాప్ లో వాటిని పొందుపరిస్తే ఆ లొకేషన్ స్పష్టంగా చూపిస్తుంది.
మీ స్థలం కలిగిన సర్వే నంబర్ గుండా త్రిబుల్ ఆర్ వెళుతున్నప్పటికి, సరిగ్గ ఎక్కడి నుండి పోతుందో తెలుసుకోవాలంటే ఈ వెబ్ సైట్ https://bhuvan-app1.nrsc.gov.in/bhuvan2d/bhuvan/bhuvan2d.php ఓపెన్ చేసి పైన సెర్చ్ బాక్స్ లో RRR కు సంబంధించిన లాంగిట్యూడ్ లాటిట్యూడ్ పొందుపరిస్తే RRR లొకేషన్ తెలుస్తుంది. మీ స్థలానికి సంబంధించిన లాంగిట్యూడ్ లాటిట్యూడ్ సరిపోల్చుకుంటే ప్రతిపాధిత రోడ్డు గురించి స్పష్టత వస్తుంది.






