శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): గత రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ ఫేజ్ 1 కాలనీలో బావి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ కూలిన విషయం తెలుసుకొని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, పలు శాఖల సంబంధిత అధికారులతో కలసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పర్యటించి, సంఘటన స్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తమ ఇండ్ల నుంచి ఎవరు బయటకి రావొద్దు అని, అత్యవసరం తప్పితే ఎవరు బయటకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిత్యం అందుబాటులో ఉంటానని ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి, తన కార్యాలయం దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు DE శ్రీదేవి, AE ప్రతాప్, నాయకులు గౌతమ్ గౌడ్, దాత్రినాథ్ గౌడ్, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్, సాదిక్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






