మాజీ ఎంపీ మ‌ధుయాష్కీ గౌడ్‌కు బీసీ నాయ‌కుల ప‌రామ‌ర్శ‌లు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ , మాజీ పార్లమెంట్ సభ్యుడు మధు యాష్కీ గౌడ్ ను బీసీ నాయకులు ఆయ‌న నివాసంలో కలసి ఆయ‌న‌ ఆరోగ్య యోగాక్షేమలను అడిగి తెలుసుకున్నారు. మ‌ధు యాష్కీ గౌడ్ అస్వస్థతకు గురై హాస్పిటల్ నుంచి ఇంటికి రావడం అందరికీ సంతోషకరమైన అంశమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామ‌ర్శించారు. బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్య‌క్షుడు ఎస్ దుర్గయ్య గౌడ్ , గౌడ సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, గౌడ సమన్వయ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్లికట్టే విజయ్ కుమార్ గౌడ్, బీసీ జన సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు సింగం నాగేష్ గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here