శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా 47 మంది లబ్ధిదారులకు CMRF ద్వారా మంజూరైన రూ.20,74,500 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి బాధిత కుటుంబాలకి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, నాయి నేనీ చంద్రకాంత్ రావు, మారబోయిన రాజు యాదవ్, కావూరి అనిల్, చిరుమూర్తి రాజు, అష్రాఫ్, క్రాంతి, అల్లం మహేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






