ఇందిరానగర్ లో అభివృద్ధి ప‌నుల‌కు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శంకుస్థాప‌న

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని ఇందిరానగర్ లో నూతనంగా చేపట్టబోయే కమాన్ నిర్మాణపనుల శంకుస్థాపన కార్యక్రమానికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజ‌రై శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి కాలనీలోని పలు సమస్యలపై పాదయాత్ర నిర్వహించారు. కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టి తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ కాలనీ ప్రెసిడెంట్ ఆఫ్జల్, గచ్చిబౌలి విలేజ్ ప్రెసిడెంట్ సయ్యద్ నయీమ్, మహమ్మద్, సత్తార్, దినేష్, సుధాకర్, ముకేష్, అన్వర్, అబ్రర్, శేఖర్, వెంకటేష్, ముక్సిద్, అహ్మద్, మొసీన్, సయ్యేద్, సతీష్, ఫయుమ్, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here