కూక‌ట్‌ప‌ల్లి కోర్టులో 3వ జాతీయ మెగా లోక్ అదాల‌త్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కూకట్‌పల్లి కోర్టులో నిర్వ‌హించిన‌ 3వ జాతీయ మెగా లోక్ అదాల‌త్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. వెంకటేశ్వర రావు, 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి సి. పావని, ఇతర న్యాయాధికారులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఎ. సుదర్శన్ రెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు, లోక్ అదాల‌త్ సభ్యులు, పోలీసు సిబ్బంది, కోర్టు సిబ్బంది, క్లయింట్లు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ ఎం. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ రాజీ మార్గమే రాజ‌ మార్గమ‌ని, సమస్యాత్మక వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఒత్తిడి లేని, వ్యాజ్యాలు లేని జీవనాన్ని గడపాలని సలహా ఇచ్చారు. మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ, బార్ అసోసియేషన్ సభ్యులు సంయుక్తంగా కేసుల పరిష్కారం కోసం హాజరైన కక్షిదారులకు భోజన, నీటి సౌకర్యం కల్పించారు. జాతీయ మెగా లోక్ అదాలాత్ ద్వరా కూకట్‌పల్లి కోర్టులో మెత్తం 5,832 కేసులు పరిష్కరించబ‌డిన‌ట్లు సంబంధిత అధికారులు, సిబ్బంది తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here