శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ దూబే కాలనీ మెయిన్ రోడ్డు వద్ద నిరూస బ్యాంక్వెట్ హాల్ లో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ అధ్యక్షతన బీసీ కులాల, బీసీ సంఘాల ఐక్యవేదిక సమావేశంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ 80 శాతం ఉన్న బీసీలకు రాజకీయంగా, సామాజికంగా ఆర్ధికంగా తీవ్రమైన అన్యాయం జరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గత పాలకులు బీసీల పట్ల వహించిన నిర్లక్ష్యం వలన బీసీలకు నష్టం జరిగిందని, ఒక గొప్ప సంకల్పంతో పోరాడి కృషి చేసి 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చిన ఘనత సీఎంకి చెందుతుందని తెలిపారు. అందులో భాగంగా బీసీలకు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలోని బీసీలందరూ ఏకమై ఒకే నినాదంతో ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపిసీసీ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ గౌడ్, ఆర్ కృష్ణయ్య తనయుడు డాక్టర్ అరుణ్, ఓ శ్రీనివాస్ యాదవ్, డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, మహిపాల్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, సైదులు యాదవ్, వెంకటేష్ ముదిరాజ్, బీసీ సంక్షేమ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






