శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): వినాయక నవరాత్రుల సందర్భంగా హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఏర్పాటుచేసిన పలు వినాయక మండపాలను PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో కలిసి డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాను టౌన్ షిప్‌లో గణేష్ మండపం వద్ద నిర్వహించిన లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి వారు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మల ధాత్రినాథ్ గౌడ్ ,వెంకటేష్ గౌడ్, కార్తీక్ గౌడ్, సంజయ్ గౌడ్, రాకేష్, శ్రీధర్, గిరి, భగత్, రవి, శ్రావణ్, కిషోర్, సురేష్, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ ప్రవీణ్, అరవింద్ పాల్గొన్నారు.






