శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని CBR ఎస్టేట్, KSR ఎన్‌క్లేవ్, ఫ్రెండ్స్ కాలనీ , విద్యా నగర్, భవాని పురం, శంకర్ నగర్ కాలనీలలో కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపాలను కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సందర్శించి గణేష్ పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం వినాయక కమిటీ సభ్యులు ఏర్పాటుచేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు , భక్తులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






