శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణేష్ మండపాలను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్బంగా వెజిటేబుల్ మార్కెట్ లోని గణేష్ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మార్కెట్ డెవలప్మెంట్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. ఇటీవలే జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి మార్కెట్ పర్యటనలో భాగంగా సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయిలో చర్చించి పనులను ప్రారంభించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, కే. రాంచందర్, లక్ష్మీనారాయణ గౌడ్, నారాయణ, కరుణాకర్ గౌడ్, లక్ష్మా రెడ్డి, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోవింద్ చారీ, గోపి యాదవ్, మార్కెట్ సభ్యులు శ్రీనివాస్, ఖాజా పాషా, పాండు, మొయిస్, వెంకటేష్, హరి, స్థానిక వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






