శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు మన అందరి జీవితాలలో సుఖశాంతులు నింపాలని కోరుకుంటున్నానని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా, శ్రీల గార్డెన్ కాలనీ, డోవ కాలనీ, న్యూ కాలనీ, వీడియో కాలనీ, కృష్ణ సాయి ఎన్‌క్లేవ్, బి కె ఎన్‌క్లేవ్, నాగార్జున ఎన్‌క్లేవ్ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయకులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి చల్లని దీవెనలు మియాపూర్ డివిజన్ ప్రజలందరిపై ఉండాలని ఆ విఘ్నేశ్వరున్ని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కాలనీవాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






