గణనాథుడి కృపా కటాక్షాలు ప్రజలపై సంపూర్ణంగా ఉండాలి: కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన గణనాథుల‌ మండపాలను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు ఆయ‌న‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ విఘ్నేశ్వరుని కరుణా కటాక్షం ప్రజలపై తప్పక ఉంటుందన్నారు. ఆ గణనాథుడు ప్రతి మనిషి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరారు. అంద‌రినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఉత్సవం వినాయక చవితి అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగండ్ల హుడా రెసిడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు హనుమంత్ నాయక్, తిరుపతి, రంగస్వామి, రమేష్, సాయి, స్థానిక నేతలు, భక్తులు, మహిళలు, కాలనీ వాసులు, కార్యకర్తలు, గణేష్ మండపాల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here