శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల , నల్లగండ్ల హుడా కాలనీ, అపర్ణ సైబర్ జోన్, అపర్ణ సైబర్ కమ్యూనిటీ, గోపన్ పల్లి సోఫా కాలనీ, గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్ కాలనీలలో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు వినాయకుడు అని అందుకే ఆయనను విఘ్నేశ్వరుడు అంటారని అన్నారు. ఎంతోమంది దేవుళ్లు ఉన్నప్పటికీ మొదట పూజలు అందుకునేది ఆయనే కాబట్టి ఆదిదేవుడిగా కొలుస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు , భక్తులు తదితరులు పాల్గొన్నారు.






