వినాయ‌క మండ‌పాల్లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పూజ‌లు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వినాయక చవితి పండుగను పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ లోని రామయ్య నగర్, హుడా ట్రేడ్ సెంటర్, ఆదర్శ్ నగర్, నెహ్రూనగర్, గోపినగర్, శ్రీరామ్ నగర్ సీ బ్లాక్, సాగర సంఘం కమిటీ హాల్ లలో, న‌ల్లగండ్ల హుడా, నల్లగండ్ల చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఆవరణలో పలు కాలనీల్లో, బస్తీలలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి మండపాలను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కమిటీ నిర్వాహకులు, అర్చకులు ఘన స్వాగతం పలికి శాలువాతో కార్పొరేటర్ ని ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నప్రాసాద వితరణలో పాల్గొని భక్తులకు వడ్డించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ప్రతి ఒక్కరూ ఈకో ఫ్రెండ్లీ గణపయ్యను పెట్టి రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలని కాంక్షించారు. ఆ విఘ్నేశ్వరుడు ప్రజలందరికీ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలను ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకుడు రాగం అనిరుధ్ యాదవ్, సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, సీనియర్ నాయకులు యాదా గౌడ్, జనార్దన్ రెడ్డి, లక్ష్మి నారాయణ గౌడ్, పురం విష్ణువర్ధన్ రెడ్డి, నర్సింహా గౌడ్, గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, శ్రీకాంత్ దేవులపల్లి, విజయందర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, నర్సింహా, సుభాష్, రమేష్, రంజిత్, రవికిరణ్, శంకర్ సింగ్, మహేందర్, షాకీర్, ఖాసీం, సాయి, విజయ్, నాందేవ్, గోపినగర్, నెహ్రూనగర్ యూత్ తదితర గణేష్ మండప ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here