శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మదీనాగూడ ఫార్చూన్ హైట్స్‌లో స్థానిక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలో గణపతి లడ్డూను రూ.2.30 లక్షలకు సౌత్ సెంట్రల్ రైల్వే ZRUCC మెంబర్ డి.కాశీనాథ్ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు హరిశంకర్ గౌడ్, కార్యదర్శి హరీష్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.






