శేరిలింగంపల్లి, ఆగస్టు 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని లింగంపల్లి ఎస్ జి టవర్స్, బృందావనం కాలనీ, ఆదర్శ్ నగర్ కమిటీ హాల్, రాజీవ్ గృహకల్ప, రైల్ విహార్, తదితర కాలనీలలో ప్రతిష్టించిన గణనాథులను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో సిరిసంపదలను కలిగి ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లవేళలా ఆ గణనాధుని ఆశీస్సులు కలిగి ఉండేలా ప్రార్థించినట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, సీనియర్ నాయకులు లక్ష్మి నారాయణ గౌడ్, SLVDC ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, ఎస్ జి టవర్స్ కమిటీ బొబ్బిలి రాజు యాదవ్, సుజిత్, సుభాష్ రాథోడ్, నిరంజన్, రవి, వెంకటేష్ ముదిరాజ్, చందు, సత్యనారాయణ, సుజిత్, రఘు చారీ, వినయ్ గౌడ్, అవినాష్, సాయి, రేవంత్, మహిళలు స్వరూప, సత్యవతి, లక్ష్మి, ఆయా కాలనీల వినాయక మండప కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






