శేరిలింగంపల్లి, ఆగస్టు 30 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పోలీస్ స్టేషన్ సిఐ శివ ప్రసాద్ జన్మదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు బోయిని మహేష్ యాదవ్ ఆయనని మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ సీఐ శివ ప్రసాద్ ఆదర్శవంతమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తూ, పోలీసు వ్యవస్థకి గౌరవాన్ని తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇంకా అనేక సంవత్సరాలు ఆయన ప్రజాసేవలో ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాబు రెడ్డి, సురేష్, శ్రీనివాస్ యాదవ్, సలీం, రామ కృష్ణ, సాయి రెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.






