శ్రీరామకృష్ణ వివేకానంద సేవా సమితి ఆధ్వ‌ర్యంలో సంగీతం, భక్తి గీతాలు, దేశభక్తి గీతాల‌ పోటీలు

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 26 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మియాపూర్‌లో ఉన్న శ్రీరామకృష్ణ వివేకానంద సేవా సమితి ఆధ్వ‌ర్యంలో సంగీతం, భక్తి గీతాలు, దేశభక్తి గీతాల‌ పోటీల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు నిర్వాహ‌కులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఆగ‌స్టు 26, 27 తేదీల్లో రాత్రి 7 గంట‌ల‌కు ఈ పోటీల‌ను నిర్వ‌హిస్తామ‌ని అన్నారు. కూక‌ట్‌ప‌ల్లి, మియాపూర్ ప‌రిస‌ర ప్రాంతాల‌కు చెందిన ఔత్సాహికులు ఎవ‌రైనా స‌రే ఈ పోటీల్లో పాల్గొన‌వ‌చ్చ‌ని సూచించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు శ్రీరామకృష్ణవివేకానంద సేవాసమితి ధ్యానమందిరం, ప్లాట్ 166, రాధామాధవ్ అపార్ట్ మెంట్ జంక్షన్ దగ్గర, ప్రగతి ఎంక్లేవ్ కాలనీ, మియాపూర్ అనే చిరునామాలో సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని లేదా 905989203 అనే నంబ‌ర్‌కు ఫోన్ చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here