అన్నమయ్యపురంలో అల‌రించిన‌ మోహన మురళి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ స్వరార్చన

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు ఆధ్వర్యంలో కొన‌సాగుతున్న నిత్య కార్యక్రమాలలో భాగంగా శనివారం మధ్యాహ్న 12 గంట‌లకు ఆశ్రితులకు అన్నదాన ప్రసాద వితరణ జర‌గగా, సాయంత్రం 5 గంట‌ల నుండి అన్నమ స్వరార్చన చేశారు. తొలుత విష్ణు సహస్రనామ స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, అన్నమయ్య అష్టోత్తరం, గురు స్తుతి నిర్వహించారు. తదుపరి మోహన మురళి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ బృందం బృంద రవి కిరణ్, శ్రీనిధి మంతెన, ఎల్. అక్షర, ఎం. అక్షర, సంహిత, మోహిత్, గీత, చైత్ర, హారిక, హంసిక, ప్రహర్షి, అద్రిత, మనస్విని, వినమ్ర, హర్షిని సంయుక్తంగా మహా గణేశ పంచరత్నం, శ్రీమన్నారాయణ, ఇందరికి అభయమ్ములిచ్చు చేయి, బ్రహ్మ కడిగిన పాదము, మాధవ కేశవ, ఆది మూలమే, చక్కని తల్లికి, రామచంద్రుడితడు, మనుజుడై పుట్టి, గోవింద గోవింద, శరణు శరణు, అదివో అల్లదివో, నారాయణతే నమో నమో, బ్రహ్మమొక్కటే అనే చక్కని కీర్తనలకు తమ మధుర స్వరాలను జోడించి శ్రీ స్వరసిధ్ధి వేంకటేశ్వర స్వామి వారికి సభక్తి పూర్వకంగా అన్నమ స్వరార్చనను అందించారు. వీరికి ఉమాశంకర్ మంతెన ఫ్లూట్ (వేణువు) తో, గుణరాజన్ తబలాతో వాయిద్య సహకారం అందించారు. అనంతరం కళాకారులకు సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్, సంస్థ వ్యవస్థాపకురాలు డా. శోభా రాజు జ్ఞాపికల‌ను అందించారు. చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతులు అందించి వ‌చ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here