ప్రేమనగర్ బి బ్లాక్ లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: కార్పొరేటర్ హమీద్ ప‌టేల్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమనగర్ బి బ్లాక్ లో నెల‌కొన్న పలు సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో కలిసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ స్థానికంగా పర్యటించారు. ప్రేమ్ నగర్ బి బ్లాకు కాలనీ వాసులు కాలనీలో నెల‌కొన్న‌ అంతర్గత డ్రైనేజీ, ఓపెన్ నాలా వంటి పలు సమస్యలను కార్పొరేట్ హామీద్ పటేల్ కు విన్న‌వించారు. ఈ సందర్బంగా బస్తీలో కొన్ని చోట్ల ఓపెన్ నాలాలో పేరుకుపోయిన చెత్తను, మట్టిని నూతన సాంకేతిక మేషనరీనీ ఉపయోగించి క్లియర్ చెయ్యాలని అధికారులకు సూచించారు. పోచమ్మ గుడి వెనుక నూతన డ్రైన్ బాక్స్ నిర్మాణ పనులకు ప్రతి పాదనలు రూపొందించి వెంటనే పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఏంసీ అధికారులను కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆదేశించారు.

కొన్ని వీధుల్లో ఉన్న పాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీని మార్చి నూతన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చెయ్యాలని సంబంధిత HMWS అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లో పేరుకుపోయిన మట్టి, చెత్తను స్టిల్ట్ మెషిన్ సహాయంతో క్లియర్ చేసి వెంటనే ఆ మట్టిని ఎత్తి వేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్బంగా ప్రేమ్ నగర్ బీ బ్లాకు బస్తీ వాసులు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కార్పొరేటర్ హమీద్ పటేల్ కి, అధికారులకు అందజేశారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ తోపాటు జీహెచ్ఏంసీ ఇంజనీరింగ్ విభాగపు అధికారులు ఈఈ కే. శిరీష, డీఈ ఆనంద్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, HMWS వాటర్ మేనేజర్ సందీప్, ఇంచార్జి శ్రీకాంత్, సీనియర్ నాయకులు ఎన్. రూప రెడ్డి, డా. రమేష్, గొల్లెం యాదగిరి, గిరిగౌడ్, వెంకటేష్, వెంకట్ రెడ్డి, సత్తిబాబు, మల్లేష్, సంపత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here