శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ బస్ బాడీ యూనిట్ వద్ద ఉన్న కనకదుర్గ కాళీమాత ఆలయ ముఖ్య సలహాదారు బాలింగ్ గౌతమ్ గౌడ్ కనకదుర్గ కాళీమాత ఆలయంలోని కనకదుర్గ, కాళీమాత, ఆదిపరాశక్తి అమ్మవార్లను కుటుంబసమేతంగా దర్శించుకుని వడి బియ్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నమస్తే శేరిలింగంపల్లి ఎడిటర్ పుట్ట వినయ్ కుమార్ గౌడ్, కనకదుర్గ కాళీమాత రిజిస్టర్ ఆలయ కమిటీ అధ్యక్షుడు, చైర్మన్ రాచమళ్ళ కృష్ణ గౌడ్, ఇమ్యానియాల్ రాజ్, ఆలయ సలహాదారు ఏకాంత్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు రేఖమ్మ, బాబు, సాయికుమార్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






