శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీ కమిషన్ చైర్మన్ బిందెశ్వర్ ప్రసాద్ మండల్ జయంతి వారోత్సవాల సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ప్రముఖ బీసీ నాయకుడు, కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ తో కలిసి బిపి మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ బీపీ మండల్ ఆశయాన్ని సాధిస్తామని అన్నారు. బిపి మండల్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని నినదించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం కోసం బడుగు బలహీన వర్గాల ప్రజలు లక్షలు లక్షలు రూపాయలు చెల్లించలేరని, వారికి సామాజిక, రాజకీయ న్యాయం జరిగే వరకు పోరాడుదాం అని అన్నారు. దేశంలో పేదలు ఆకలి చావులతో ఆత్మహత్యలతో, ముఖ్యంగా వ్యవసాయ దారుల కుటుంబాల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, పేదరిక నిర్మూలనలో భాగంగా పేదలకు న్యాయం జరగాలంటే రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య రంగాల్లో అన్ని విధాలా న్యాయం జరగాలంటే అధికారమే ముఖ్యమని, దాన్ని సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ , శేరిలింగంపల్లి బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, అడ్వకేట్ బి రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిబి కృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ రామకృష్ణ గౌడ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు, బిసి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు నర్సింగ్ ముదిరాజ్ , ఆర్టీసీ సురేష్ యాదవ్, వడ్డెర సంఘం కిషోర్, పద్మశాలి సంఘం అశోక్, రజక సంఘం రాజేష్, విశ్వకర్మ సంఘం హరి చారి, నాయి బ్రాహ్మణ సంఘం కిషోర్, సైదులు యాదవ్, మణికంఠ, మహిళా మండలి అధ్యక్షురాలు సంగమ్మ, కొండాపూర్ డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, శేరిలింగంపల్లి అధ్యక్షురాలు లలితారాణి, బీసీ నాయకులు పాల్గొన్నారు.






