శేరిలింగంపల్లి, ఆగస్టు 20 (నమస్తే శేరిలింగంపల్లి): మూసాపేట్ లోని వెంకటేశ్వర నగర్ కాలనీలో మూసాపేట్ సగర( ఉప్పర) సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 24వ వార్షికోత్సవ కల్యాణ మహోత్సవం కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం అంగరంగ వైభంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని, వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామి వారి కృప ప్రజలందరి పై ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆలయ చైర్మన్ దామోదరయ్య సాగర్, సెక్రెటరీ మన్యం సాగర్, వైస్ చైర్మన్ సాయిలు సాగర్, కోశాధికారి గోపి సాగర్, సగర సంఘం అధ్యక్షుడు లోకేష్ సాగర్, యూత్ అధ్యక్షుడు నాగరాజు సాగర్, గౌరవ సలహాదారు గడ్డపార వెంకటయ్య సాగర్, మహేష్ సాగర్, వెంకటేష్ సాగర్, రవి సాగర్, కృష్ణ సాగర్, సురేందర్ సాగర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






