శేరిలింగంపల్లి, ఆగస్టు 16 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని నవోదయ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా నవోదయ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ ప్రధాన రహదారిని పునరుద్ధరించాలని, కాలనీలో అంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల ను పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే నవోదయ కాలనీలో పర్యటిస్తానని అన్నారు. నవోదయ కాలనీ లోని ప్రధాన రహదారి ని పునరుద్దరిస్తామని, త్వరలోనే రోడ్డు పనులను ప్రారంభిస్తామని, కాలనీ లో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల ను, ఇతర సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నవోదయ కాలనీ వాసులు రాజిరెడ్డి, శర్మ, సిద్దార్థ, గణేష్, మదన్, లక్ష్మణ్, భార్గవ్, శివ శంకర్, వాసుదేవరావు, శ్రీనివాస్, సురేష్, రాజేంద్ర, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






